September 23, 2026
✍️ reporter1 reporter1
⏱️ 54 నిమిషాల క్రితం 23 Sep 2026

అమీన్‌పూర్ పెద్దచెరువు పునరుద్ధరణ పనులపై హైకోర్టు కీలక ఆదేశాలు (Telangana High Court orders status quo on Ameenpur Lake FTL land)

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్దచెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులపై తెలంగాణ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ (Full Tank Level) పరిధి భూములపై యథాతథ స్థితి (Status Quo) కొనసాగించాలని జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి ఆదేశించారు. అయితే, ప్రభుత్వం గతంలో అధికారికంగా గుర్తించిన 93 ఎకరాల 15 గుంటల పరిధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సుందరీకరణ పనులను కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వివాదంపై తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేశారు.

#Ameenpur (అమీన్‌పూర్) 🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
WhatsApp లో మిత్రులకు షేర్ చేయండి
⬅ ప్రారంభం ఇదే మొదటి వార్త
తర్వాతి వార్త ➔ అమీన్‌పూర్‌లో తీవ్రమైన డ్రైనేజీ సమస్య.. రోడ్లపై...