అందరూ దొంగలే.. తోలుతీస్తా.. మునిపల్లి తహసీల్దార్ ఆఫీసులో మంత్రి దామోదర అనుచరుడి హల్చల్
సంగారెడ్డి జిల్లా మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అనుచరుడు, రైకోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులను ఉద్దేశించి అందరూ దొంగలే.. మీ అందరి తోలు తీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. మహిళా అధికారులు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా, ఇష్టమొచ్చిన భాషలో మాట్లాడారని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#Munipally (మునిపల్లి)
🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
